రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
అలంపూర్ ఏప్రిల్ 10: ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాదులో జరుగుతున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఆలీ అక్బర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం అలంపూర్ పట్టణ కేంద్రంలో నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ కళ కోసం కాదని ప్రజల గొంతుకై నిలవాలని దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై ప్రజానాట్యమండలి గళం విప్పుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాట రూపంలో ప్రజల ముందుకు వస్తున్నదని కలలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రజానీకం అండగా నిలవాలని హైదరాబాదులో జరుగుతున్న మూడు రోజుల మహాసభల కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల ఉన్న కళాకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు రాజు ,ఈదన్న ,పట్టణ పేదల సంఘం నాయకులు బి నరసింహ ,కళాకారులు రామకృష్ణ మస్తాన్ మళ్లీ తదితరులు పాల్గొన్నారు.




