20 August, 2026 | 10:25 PM

బహిరంగ చర్చ వేదికను విజయవంతం చేయండి

20-08-2026 05:37 PM

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20 ( విజయక్రాంతి ): బహిరంగ చర్చ వేదికను విజయవంతం చేయాలని తెలంగాణా ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రం చర్చ వేదిక కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయమై కేశవరావు ప్రభుత్వ సలహాదారుడు చైర్మన్‎గా ఉద్యమకారుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీని స్వాగతిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్ నందు ఈనెల 23న ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి సభ అధ్యక్షుడిగా రాచమౌని నాగభూషణం, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములు నాయక్. ఉద్యమకారుల కమిటీ నెంబరు శోభన్ రెడ్డి. ప్రొఫెసర్ చింతకింది కాసిం, టీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథని సంజీవరావు, తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, పికేయం రాష్ట్ర అధ్యక్షుడు దండం జాను తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.