30 May, 2026 | 2:05 AM

అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచండి

30-05-2026 12:00 AM

మహబూబ్‌నగర్ టౌన్, మే 29 : విత్తన డీలర్లు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాసిపడేది లేదని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం విత్తన డీలర్లకు ఖరీఫ్ సన్నద్ధత సమావేశం వ్యవసాయ సహాయ సంచాలకుడు బి. రాంపాల్  అధ్యక్షతన రైతు శిక్షణ కేంద్రం మహబూబ్ నగర్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నారకాల లభ్యత, నాణ్యమైన విత్తనం అంధుబాటులో ఉంచాలని తెలిపారు సీడ్ నివేదిక,రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు,  స్టాక్ బోర్డు నిర్వాహన గురించి  వివరించారు. 

పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు వివరించారు. పంటల వైవిధ్యీకరణ మరియు వివిధ పంటలు విత్తనాలు అంధుబాటులో ఉంచాలాని సూచించారు. అధిక మోతాదు యూరియా వాడుక వల్ల కలిగే నష్టాలు వివరించారు. ఎరువుల బుకింగ్ యాప్ గురుంచి డీలర్ల సందేహాలు నివృత్తి చేశారు. ఈ ప్రోగ్రామ్ లో హన్వాడ, మహమ్మదాబాద్, గండీడ్ కోయిల్ కొండ మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.