10 July, 2026 | 8:03 PM

Breaking News

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ   •   తెలంగాణ ఉద్యమం తరహాలో... డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం చేస్తాం   •   12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •  

మోదీ సభను విజయవంతం చేయండి

09-05-2026 12:00 AM

నంగునూరు బీజేపీ పిలుపు

నంగునూరు, మే 8: ఈ నెల 10న సికింద్రాబాద్ పరే డ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేం ద్ర మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను దిగ్విజయం చే యాలని నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. మండల కేం ద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ సభ కోసం నంగునూరు నుంచి 500 మందికి పైగా కార్యకర్తలను తరలించేందుకు బస్సుల ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

ప్రధాని మోదీ  తెలంగాణకు అందిస్తున్న అభివృద్ధిని చాటి చెప్పేలా  ప్రతి కార్యకర్త సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగ కనకయ్య, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రజినీకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పప్పు సురేందర్ రెడ్డి,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.