22 April, 2026 | 2:13 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోండి

10-03-2026 01:51 AM

బొగ్గును సమీకరించుకునేందుకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పం దం చేసుకోవాలని, పూర్తి 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీసీపీకి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు.

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్‌లో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం మీకు తెలిసిందే నన్నారు.

అనంతరం సెకండ్ ఫేజ్‌లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందన్నారు. మొదటి ఫేజ్‌లో లాగే రెండవ ఫేజ్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందన్నారు. రాను న్న రోజుల్లో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందన్నారు.

అందులో భాగంగా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని తెలిపారని, అంతేకాకుండా 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు లేఖలో తెలిపారు.

దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు.అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్టీపీసీకి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని, గతంలో విద్యుత్ రంగం మీద రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇతర థర్మల్ పవర్ ప్రాజెక్టులతో పోలుస్తూ, మొదటి ఫేజ్‌లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టును గురించి స్వయంగా మీరు ప్రశంసించిన విషయం మీకు గుర్తు ఉండే ఉంటుందన్నారు.

అయితే పూర్తి 4000 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో తగిన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందన్నారు.

అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో తక్కువ ధరకే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండటంతో ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి, అవసరమైన ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. కాబట్టి, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని,ఎన్టీపీసీ, సెకండ్ ఫేజ్‌లో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేలా కృషి చేయాలని సీఎంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.