22 August, 2026 | 10:58 PM

ఉత్తమ సీఆర్పీగా మహమూద్‌కు సన్మానం

22-08-2026 09:53 PM

రామారెడ్డి,(విజయ క్రాంతి): జిల్లా స్థాయిలో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ సీఆర్పీగా ఎంపికైన మహమూద్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) మల్లికార్జున్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో చేతుల మీదుగా మహమూద్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఐఆర్పీలు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.