22 August, 2026 | 10:57 PM

భూగర్భ జలాలను పెంపొందించడానికి అందరు బాధ్యత

22-08-2026 10:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో జల సిరి కార్యక్రమంలో భాగంగా నీటి విలువ గురించి గ్రామ సర్పంచి లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో గ్రామ పరిధిలో జలసిరి నీటి సంరక్షణ మన భవిష్యత్తు ప్రతి నీటిబొట్టును పొదుపుగా వినియోగిస్తూ వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించడానికి మన అందరి బాధ్యత జలసిరి కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ ఇంకుడు గుంత - ఒకటి మ్యాజిక్ సోఫిట్ ఇంకుడు గుంతలు -రెండు బోర్ వెల్ రీఛార్జి గుంతలు రెండులకు ముగ్గు వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ...వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపుదల గురించి చెరువులో గుంటల పరిరక్షణ నీటిని వృధా అరికట్టడం ప్రతి ఇంట నీటి పొదుపుపై అవగాహన కల్పించారు.మన గ్రామం నీటి కొరత లేని గ్రామంగా తీర్చిదిద్దడం నీటిని కాపాడుదాం భవిష్యత్తు తరాలను కాపాడుదాం ప్రతి నీటి బొట్టు విలువైనది జలసిరిని సంరక్షిద్దాం అని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.