మేకపోతుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కాంగ్రెస్ నాయకులు
* మేక పోతుల బిక్షం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మహిళా నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గరిడేపల్లి లో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విద్యా కమిటీ మాజీ చైర్మన్ మేకపోతుల బిక్షం కుటుంబ సభ్యులను శుక్రవారం హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల మహిళా సంఘం నాయకులు పరామర్శించారు. బిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
సందర్భంగా సాక్షి రిపోర్టర్ మేకపోతుల వెంకటేశ్వర్లు, సరిత, మేకపోతుల గోపి గౌడ్, వినోద కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి నేరేడుచర్ల హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చామకూరి రజిత, బచ్చలకూరి రజిత, సప్పిడి సావిత్రి, నక్క రమాదేవిమాజీ, ఎంపీపీ గొట్టిముక్కల నిర్మల, మాజీ సర్పంచ్ నకరికంటి సునీత, పాశం కోటమ్మ, నాగేంద్ర, సుహాసినితో పాటు పలువురు నాయకురాలు పాల్గొన్నారు.






