కేటీఆర్ ఓ 420.. ఆయనది దొంగల బ్యాచ్
పాస్‌పోర్టు నుంచి భూ కుంభకోణం వరకు ఆయన కుటుంబమే
బండి సంజయ్ పిట్టల దొరలా మారాడు
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): కేటీఆర్ ఓ 420.. ఆయనది దొంగల బ్యాచ్. పాస్ పోర్ట్ కుంభకోణం మొదలై భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబమే ఉంది. కేటీఆర్ నీ స్థాయి ఏంటి..? నువ్వా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించేది..? ’ అని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో దొంగచాటుగా వచ్చిచేరి.. కేకే మహేందర్ రెడ్డి గొంతు కోసావు. యువతను మద్యానికి అలవాటు చేసి రాష్ట్ర భవిష్యత్ ను బీఆర్‌ఎస్ నాశనం చేసింది ’ అని మహేష్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఏం చేసారని ఒకే కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు తీసుకున్నారని నిలదీశారు. దలితుడిని ముఖ్యమంత్రి చేయకుంటే తలనరుక్కుంటానని అన్న కేసీఆర్‌కు.. ఇప్పుడు తల ఉందా లేదా..? అని చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన ఆగడాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూస్తుంటే మాదకద్రవ్యాల ప్రభావంతో మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిట్టల దొరలా మారడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తే పొడిచేస్తామన్నారు...6 నెలలుగా ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఆయా సందర్భాలను బట్టి నిర్ణయాలుంటాయన్నారు.
జాతీయ స్థాయి రాజకీయాలకు.. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. జాతీయ స్థాయిలో సీపీఎంతో దోస్తీ కొనసాగుతోందని, అదే కేరళ రాష్ట్రంలో సీపీఎంతో పోరాటం ఉంటుందని మహేష్‌కుమార్‌గౌడ్ వివరించారు. తమిళనాడులో డీఏంకేతో కలిసి ఎన్నికలకు వెళ్లినా ఆ రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలోనే టీవీకేకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. 18 ఫెడరేషన్ లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. త్వరలోనే మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.






