15 July, 2026 | 4:37 PM

Breaking News

క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •  

క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి

15-07-2026 04:37 PM

బోథ్,(విజయక్రాంతి): క్రీడల వల్ల యువత శారీరక దృఢత్వం క్రమశిక్షణ ఐక్యత భావం పెరుగుతుందని సిఐ డి.గురుస్వామి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ మైదానంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోటీలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలు విద్య ఉపాధి సాధనాలపై దృష్టి సారించాలని కోరారు. బోత్ సోనాల మండలాల్లో 24 జట్లు పోటీల్లో పాల్గొనగా రెండు రోజులపాటు క్రీడ పోటీలను నిర్వహిస్తామన్నారు.

పోటీలో గెలుపొందిన వారికి మొదటి విజేతకు 5000 రెండవ విజేతకు 300 నగదు అందిస్తామని, ట్రోపీని ప్రధానం చేస్తామన్నారు ఈనెల 18 నిర్వహించనున్న గుట్ట పక్క తండా తాండ గ్రామంలో జరగనున్న పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా బహుమతులను అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సై వి .పురుషోత్తం, ఫ్రెండ్స్ క్లబ్ చైర్మన్ వైద్య సురేష్ ,బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎలుక రాజు, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.