15 July, 2026 | 4:11 PM

Breaking News

చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •  

చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్

15-07-2026 04:11 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని కేశన్ పల్లి గ్రామంలో ఇటీవల కన్నుమూసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం తండ్రి చొప్పరి లింగయ్య కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య, రాష్ట్ర నాయకులు రామస్వామి, రామకృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ తానీ ప్రభాకర్, ఇసంపెల్లి శ్రీనివాస్, రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు నల్లాల నందు తదితరులు చొప్పరి సదానందంను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.