15 July, 2026 | 5:00 PM

Breaking News

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •  

గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం

15-07-2026 04:46 PM

* బందనకల్ లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు 

* కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం  బందనకల్ గ్రామంలో ఎస్డిఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్)తో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్రెడ్డి ప్రారంభించారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు రాజును గ్రామానికి చెందిన నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద మొత్తం 5 ఐమాక్స్ లైట్లను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి చొరువతో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో మన మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేసి జిల్లాలోనే ముందు వరుసలో నిలబెట్టెందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్  గ్రామశాఖ అధ్యక్షుడు రంజిత్, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుపాకుల శ్రీనివాస్, నాయకులు బాల్ రెడ్డి, సాయి, రాజయ్య, బీసీ స్టడీ డైరెక్టర్ వెంకటస్వామి, కార్తీక్ రెడ్డి, నరేష్, శ్రీనివాస్, రాములు, కనకయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.