15 July, 2026 | 4:20 PM

టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం

15-07-2026 04:20 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో భిక్కనూర్‌లో మండల, కళాశాల కమిటీలను బుధవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ హాజరై నూతన కమిటీ సభ్యులను ప్రకటించారు. విద్యార్థి సంఘం లక్ష్యాలు, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో టీజీవీపీ పాత్రను వివరించారు. మండల అధ్యక్షుడిగా దేవుని భరత్, వైస్ ప్రెసిడెంట్‌గా విజయ్, మహిళా మండల అధ్యక్షురాలిగా శ్రీనిధి, వైస్ ప్రెసిడెంట్‌గా అంకితను ఎంపిక చేశారు. కళాశాల అధ్యక్షుడిగా శ్రీవర్ధన్, వైస్ ప్రెసిడెంట్‌గా మనదీప్, ఇన్‌చార్జిగా కార్తీక్, మహిళా కళాశాల అధ్యక్షురాలిగా షిరీన్, వైస్ ప్రెసిడెంట్‌గా మహాలక్ష్మి, ఇన్‌చార్జిగా నిరక్షణను నియమించారు. కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ సమీర్, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.