10 July, 2026 | 10:25 PM

తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ సమావేశంలో పాల్గొన్న బూర్గంపాడు ఉద్యమకారులు

10-07-2026 09:14 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): హైదరాబాదులో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ సమావేశంలో శుక్రవారం బూర్గంపాడు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ ఇవ్వాలని కమిటీని కోరారు. అదేవిధంగా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో కమిటీ వారు గుర్తించి వారికి అనేక సంక్షేమ పథకాలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోడేటి సత్యనారాయణ, మరి సాంబా రెడ్డి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.