6 July, 2026 | 2:27 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే

11-04-2026 05:49 PM

- మండల బీసీ సంఘం అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్.

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మహాత్మ జ్యోతిభాపూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు చైతన్య వంతులు చేయడానికి ఉచిత విద్యను అందించి సత్యశోదక సమాజాన్ని స్థాపించి అంటారని తనం నిర్మూలనకు కృషి చేసి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శులు రవి, రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి రమేష్, యూత్ అధ్యక్షుడు నితిన్, ఉపాధ్యక్షుడు నవీన్, కార్యదర్శి సత్యం, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.