6 July, 2026 | 1:19 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

భాగిర్తిపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం

11-04-2026 05:52 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు, ఉపసర్పంచ్ వడ్ల స్వామి ఆధ్వర్యంలో చిన్నారుల కోసం అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు మొదటి ఆహారం అందజేసి, విద్య ప్రారంభానికి శ్రీకారం చుట్టించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్తు మంచి దిశగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్యామల, సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.