calender_icon.png 15 February, 2026 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

15-02-2026 07:09:32 PM

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అర్చక బృందం ఆధ్వర్యంలో మహారాష్య పూర్వక రుద్రాభిషేకం, హోమాలు, బలిహరణ గ్రామోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం శాస్త్రవేత్తంగా జరిపించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు దంపతులు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు, వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. ఆలయ చైర్మన్ మల్లెల నరసింహారావు, మేనేజర్ పి.వి.రమణ ఏర్పాటును పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో  కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ సిఐలు శ్రీలక్ష్మి ఇంద్రసేనారెడ్డి పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.