calender_icon.png 15 February, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ మునిసిపల్ చైర్మన్ పీటం ఎవరిని వరిస్తుందో

15-02-2026 07:06:09 PM

మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

కోదాడ: కోదాడ మునిసిపల్ చైర్మన్ పీటం ఎవరిని వరిస్తుందోనని పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ పీటం కోసం ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు, పారా సత్యవతి సీతయ్య, దేవరపల్లి మల్లీశ్వరి గుండప్పనేని పద్మావతి నాగేశ్వరరావుతోపాటు మైనారిటీ అభ్యర్థిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్తె షేక్ నేహా పోటీలో ఉన్నారు.

కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా హైదరాబాద్ లోని క్యాంపుకు తరలించారు. కౌన్సిలర్లందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. చైర్మన్ పదవి ఎవరికి కేటాయించినా, వైస్ చైర్మన్ పదవిని బలహీన సామాజికవర్గాలకు కేటాయించే ఆచారం కొనసాగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయోనని కోదాడ పట్టణంలో చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో కొత్త కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగనుండడంతో ఉత్కంఠకు తెరపడనున్నది.