బక్రీద్ పై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే(Maharashtra Minister Nitesh Rane) వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వర్చువల్(VIRTUAL BAKRID)గా బక్రీద్ నిర్వహించుకోవాలని మహారాష్ట్ర మంత్రి సలహా ఇచ్చారు. కంప్యూటర్ లో మేక ఫొటో పెట్టుకుని వధిస్తున్నట్లు చూపాలని నితీష్ రాణే సూచించారు. అలాంటి సలహా చెప్పే ధైర్యం పర్యావరణ వాదులకు ఉందా? అని నితీష్ రాణే(Nitesh Rane) ప్రశ్నించారు. ఒక సారి చెప్పి చూడండి, తర్వాత వాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలుస్తోందన్నారు. హోళీ, దీపావళి పండగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని హిందువులకు సలహాలు ఇస్తున్నారంటూ మంత్రి నితీష్ రాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు కొందరు హిందువుల వల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మంత్రి నితేష్ రాణే మాట్లాడుతూ, "...మన హోలీ పండుగలో, వాతావరణానికి అనుగుణంగా హోలీ జరుపుకోవాలని, పొడి హోలీ జరుపుకోవాలని చెబుతారు... దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చవద్దని అంటారు... కంప్యూటర్‌లో మేక చిత్రాన్ని పెట్టి, దానిని 'వర్చువల్‌గా' బలి ఇస్తున్నట్లు చూపిస్తూ బక్రీద్ జరుపుకోమని ప్రజలకు సలహా ఇవ్వాలి..."






