11-02-2026 02:44:15 AM
పార్లమెంట్‌లో ప్రస్తావించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ వేధింపుల వల్లనే నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్ పట్టణంలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోనే దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను కిడ్నాప్‌లు, దోపిడీలు, డబ్బులు పంచుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సభ ఖండించాలని ఆయన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు.