9 May, 2026 | 6:46 PM

అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధు మోహన్

09-05-2026 12:00 AM

గద్వాల, మే 8 : జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) గా సి.హెచ్. మధు మోహన్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మధు మోహన్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం వివిధ శాఖల పలువురు అధికారులు అదనపు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.