30 May, 2026 | 5:11 PM

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

30-05-2026 04:29 PM

కేసీఆర్‌కు LSCS ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ రాజీనామా లేఖ

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నియోజక వర్గంలో నాయకత్వ లోపం వల్లే పార్టీ దిగజారిందని, కార్యకర్తలు నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పాల్వంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. 2014లో పార్టీలో చేరి 12 ఏళ్లుగా పని చేశానని, 2020లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు.

అయితే కొత్తగూడెం నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లుగా నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సరైన దిశానిర్దేశం లేక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీలో కొనసాగలేనని, రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.