3 July, 2026 | 11:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

లవ్వు లవ్వు రాకాసి..

03-07-2026 12:00 AM

మల్టీ ట్యాలంటెడ్ జీవీ ప్రకాశ్‌కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘లవ్వు లవ్వు రాకాసి’ అనే పాటను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. జాజిమల్లి సింగారి.. కలర్ కలరూ బంగారి.. యవ్వనాలు అరవిరిసిన వయ్యారి.. పాలల్లో ముంచేసిన పువ్వల్లే ఉన్నావే.. ఊరించే అందాల ఏంజల్ బేబి.. లవ్వు లవ్వు రాకాసీ.. లవ్వులోనే పడ్డానే..’ అంటూ సాగుతోందీ గీతం.

రాజ్‌శ్రీ సుధాకర్ రాసిన ఈ పాటకు సామ్ సీఎస్ ట్యూన్ అందించగా, అరవింద్, రేష్మా శ్యామ్ పాడారు. ఈ పాటలో జీవీ ప్రకాశ్, కయదు లోహర్ మధ్య కెమిస్ట్రీ ఆకర్షణగా నిలుస్తోంది. టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహ ర్జన్, పెమ త్సంచో, సునీతా శ్రేష్ఠ పలు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: అరుణ్ రాధాకృష్ణన్; సంగీ తం: సామ్ సీఎస్; ఎడిటర్: రాజేశ్ ఎం; ఆర్ట్: శివశంకర్.