3 July, 2026 | 11:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నా విజన్‌ను చూపిద్దామనే డైరెక్షన్ చేశా!

03-07-2026 12:00 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిషేక్ నామా విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బీ ఎందుకు తెరవలేదనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ, దాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ చేయాలనిపించింది. అలా రాసిందే ఈ ‘నాగబంధం’ కథ. -ఇది నేను విజువలైజ్ చేసుకున్న కథ. నా విజన్‌ను నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని దర్శకత్వం వహించా. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉండదు.

అందుకే అక్కడ చూసిన వాటిని స్కెచ్‌ల రూపంలో పేపర్‌పై రూపొందించుకున్నాం. ఆ తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, వేరే ఆర్కిటెక్చర్‌ను కూడా జోడించి సెట్‌ను డిజైన్ చేశాం. -అయితే,  అదొక ఫిక్షనల్ టెంపుల్‌గానే చూపించాం. ఇదొక ఫిక్షనల్ ట్రెజర్ హంట్ కథ, దాన్ని ఫాంటసీ కోణంలో చెప్పాం. -నిజానికి ఈ కథ మొదలు పెట్టినప్పుడు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకోలేదు. కొత్త నటుడితో సినిమా చేయాలనుకున్నా. ఎందుకంటే ఇది కథ మీద నడిచే సినిమా.

పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనా లుంటాయి. అందుకే కొత్త హీరో అయిన విరాట్ కర్ణను ఎంపిక చేశా. -మేము రియల్ టెంపుల్స్ షూట్ చేయా లనుకున్నాం. కానీ అనుకున్నంత అనుమతులు దొరక లేదు. దీంతో సెట్ వేయాల్సి వచ్చింది. సెట్స్, ఆర్ట్ వర్క్, మేకప్, సిజీ విషయంలో బడ్జెట్ కూడా పెరిగింది. -మా నిర్మాతలు మొదటి నుంచి కథను, నన్ను పూర్తిగా నమ్మి ఖర్చు చేశారు. -నిర్మాతలు రాకముందే ప్రీ-ప్రొడక్షన్ చేశా. అందుకే వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. -ఇది మైథాలజీ మాత్రమే కాదు, కుటుంబమంతా కలిసి చూడదగ్గ కమర్షియల్ సినిమా కూడా. ఈ సినిమాకు కథే హీరో. ‘నాగబంధం 2’ చేసే ఆలోచన ఉంది. సీక్వెల్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉన్న కథ ఇది.