3 July, 2026 | 11:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

భయపెడుతూ థ్రిల్ పంచే లీసా

03-07-2026 12:00 AM

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘లీసా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓం శ్రీరామ్ ఆర్ట్స్, అయాన్ష్‌రెడ్డి ప్రజెంట్స్, ఐరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, ఇలా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్రబృందం.. ఈ సినిమాలో అనన్య నాగళ్ల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో అనన్య ముఖమంతా తీవ్రమైన గాయాలతో, చుట్టూ రక్తం మరకలతో ఎంతో భయానకంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని థియేటర్ సీటుకే కట్టిపడేసేలా, ఉత్కంఠభరితంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల లీసా అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, ఈ సినిమాలో ఆమె విభిన్నమైన, షాకింగ్ కోణాలతో కూడిన ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి అవార్డు గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం అద్భుతమైన స్క్రీన్ప్లేకి తగ్గట్టుగా, కళ్లు చెదిరే విజువల్స్ను చాలా రిచ్గా రూపొందించారు. అనన్య నాగళ్ల షాకింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె చుట్టూ ఉన్న రక్తం మరకలు, ముఖంపై గాయాలు చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతుందని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.