పది పరీక్ష హాల్లోనే ప్రేమ!?
- బాలికను ప్రేమ పేరుతో నమ్మించి మోసగించిన యువకుడు
- కేజీబీవీలోనే నవమాసాలు మోసిన బాలిక
- కడుపునొప్పి పేరుతో పురిటి నొప్పులతో బాత్రూంలో బిడ్డకు జననం
- నాగర్‌కర్నూల్ బాలిక ఘటనలో విస్తుపోయే వాస్తవాలు
నాగర్‌కర్నూల్, మార్చి 3 (విజయక్రాం తి) : పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిన కుటుంబంలోని ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో తమ బిడ్డను జిల్లాలోని ఓ కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చివరికి 10 పరీక్షలు రాసే క్రమంలో పరీక్ష హాల్లోనే ఓ యువకుడు కన్ను బాలికపై పడింది. ప్రేమ పేరుతో దగ్గరై మోసగించాడు.
తల్లి కాబోతున్నట్లు తెలియక అదే కస్తూర్బా పాఠశాలలో నవ మాసాలు మోస్తూనే ఆ బాలిక ఇంటర్ పూర్తి చేసింది. తీరా పురిటినొప్పులని తెలియక కడుపునొప్పని చెపుతూ తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ చేసే క్రమంలో బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. షాక్‌కు గురైన బాలిక తల్లి ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించింది.
గమనించిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు రంగ ప్రవేశం అనంతరం విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డా యి. బాలికను పూర్తిగా నమ్మించి మోసగించిన యువకుడు మరో ముగ్గురితోనూ ఆ బాలికతో సంబంధం ఏర్పర్చినట్టు బయటపడింది. తల్లి, తండ్రిని కోల్పోయిన ఆ యువకుడు మేనమామ వద్ద పెరిగాడు. గతేడాది జరిగిన పది పరీక్ష ల్లో తన ముందు ఉన్న బాలికను పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడు.
బాలిక పండగ సెలవుల్లో మినహా ఆ పాఠశాలలోనే ఉండి నవ మాసాలు బిడ్డను కడుపులోనే మోస్తూ ఇంటర్ పూర్తి చేసినా పాఠశాల నిర్వాహకులు గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయం లోని ఓ ఉద్యోగి ఆ కస్తూర్బా పాఠశాల సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. రెండు కిలోల బరువు గల బిడ్డకు జన్మనిచ్చి న గర్భవతి అక్కడే ఉన్నప్పటికీ అనుమా నా స్పదంగా కనిపించలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంలో ఉం ది.




