28 May, 2026 | 4:40 AM

ప్రజలందరినీ చల్లగా చూడు రేణుక ఎల్లమ్మ తల్లి

28-05-2026 02:10 AM

ప్రభుత్వ విప్పు , ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్ , మే 27 (విజయ క్రాంతి):ప్రజలందరినీ చల్లంగా చూడు రేణుక ఎల్లమ్మ తల్లి అంటూ ప్రత్యేక పూజలు చేసి ఆ తల్లిని వేడుకోవడం జరిగిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, బుధవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాల మహోత్సవం సందర్భంగా విజయ రమణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా విజయరమణారావు ను సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ పడాల అజయ్, కల్లపల్లి జానీ తోపాటు పలువురు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గౌడ సంఘం సోదరులు, సోదరిమణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.