శివాజీ విగ్రహం ధ్వంసం
03-08-2026 11:08 AM
చేగుంట ఆగస్టు 03,విజయక్రాంతి: చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు శివాజీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చెరుకొని,గ్రామస్తుతో మాట్లాడి, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.






