1 July, 2026 | 6:33 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

14-04-2026 12:26 AM

పిఆర్‌టియు టిజి జిల్లాకు శాఖ ఆధ్వర్యంలో దీక్షలు 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13, (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు దీర్గాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, డి ఎ, పి ఆర్ సి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని పిఆర్టియు టీజీ కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు బి రవిలు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన దీక్షను సోమవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వానికి వెన్నవంచుకున్న ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నిరసన దీక్షతో నైనా ప్రభుత్వంలో చలనం వచ్చే సమస్య పరిష్కారానికి మార్గం సులభం అవుతుందని భావిస్తున్నామని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

ప్రధానంగా 51% పిఆర్సి తక్షణమే ప్రకటించాలి, పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, సిపిఎస్ ను రద్దుచేసి డీఎస్సీ 2003 వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని తదితర 15 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.