14 April, 2026 | 2:06 AM

గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ రాయల

14-04-2026 12:25 AM

ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, అనంతగిరి  మండలం, శాంతినగర్ గ్రామంలో గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం స్థలాన్ని పరీశీలించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను  అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేయాలని, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.