5 May, 2026 | 9:40 PM

ఫుట్పాత్ వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసిన లైన్స్ క్లబ్

05-05-2026 08:46 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మంగళవారం దమ్మపేటలోని ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న కడు నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట  వారి ఆధ్వర్యంలో   పెద్ద గొడుగులు అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట అధ్యక్షులు అంకత ఉమామహేశ్వరరావు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్  దారా యుగంధర్ లు మాట్లాడుతూ ఫుట్ పాత్ పై వ్యాపారాలు చేసుకుంటూ ఎండనకా, వాననకా కష్టపడుతూ జీవనోపాధి పొందుతున్నారని, వారికి లైన్స్ క్లబ్ తరపున సహాయంగా గొడుగులు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట  సెక్రటరీ,   L I C  వేణుగోపాల్, లయన్స్ క్లబ్ ట్రెజరర్   పసుమర్తి ముక్తేశ్వరరావు,  లయన్స్ క్లబ్ సీనియర్  సభ్యులు కక్కిరాల రమేష్, కక్కిరాల వెంకటేశ్వరరావు, సీనియర్ అడ్వకేట్  ఆడమ్స్,  అశ్వరావుపేట లైన్స్ క్లబ్ సభ్యులు ధారా మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.