4 April, 2026 | 4:11 AM

ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదాం

04-04-2026 12:40 AM

నగర డిప్యూటీ చైర్మన్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్, ఏప్రిల్ 3 : నెలకొన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలని లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోదామనినగర డిప్యూటీ చైర్మన్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 11వ డివిజన్ లోని పాలిటెక్నిక్ కళాశాల ఏరియాలో ని శ్రీ రామమ్మ గుడి కీ మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మన డివిజన్ లోని ప్రతి ఒక్క పనిని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటు 11వ డివిజన్ ని కార్పొరేషన్ లొనే అభివృద్ధి లో ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడి అధ్యక్షులు యశోద, పాలకొండ హరిత, కల్పన, శోభారాణి, శ్రీనివాసులు, ప్రజలు పాల్గొన్నారు.