ఇరుముడికి ఉన్న వైబ్‌ను కంటిన్యూ చేద్దాం
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయిక. బేబీ నక్షత్ర, సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర నిర్మాతలు బుధవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ మేరకు భీమవరంలో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది.
నెక్స్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం” అన్నారు. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. రవితేజతో సినిమాలో పనిచేయడం నాకు చాలా స్పెషల్. ఆయన్ని చాలా దగ్గరగా చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కచ్చితంగా ఇది రవితేజకు మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుంది.
అలాంటి సినిమాలో నేను హీరోయిన్‌గా ఉండటం నాకు ఇంకా స్పెషల్” అని తెలిపింది. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. “ట్రైలర్‌లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ఈ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ అంటే ఇద్దరికి పడిన ముడి. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి..
అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు చిక్కుముడులను కలిపి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టాం. ఈ మూడు అంశాలను ఒక ఫ్యామిలీ డ్రామాలో కలిపి తీసుకురావడం ద్వారా సినిమా ఇచ్చే ఇంటెన్సిటీ మిమ్మల్ని అందరినీ స్ర్పజ్ చేస్తుంది. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు.. ఇది ఒక గొప్ప ఎమోషన్” అని చెప్పారు. నిర్మాత రవి మాట్లాడుతూ.. “సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ఇది చాలా పెద్ద రేంజ్‌కు వెళ్తుందని నమ్ముతున్నాం. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ కూడా అద్భుతంగా జరుగుతోంది. ప్రభాస్ గారు ఇరుముడి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బేబీ నక్షత్ర, నిశాంత్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు మాట్లాడారు.






