మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
24-07-2026 01:31 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 23 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్డీవో దత్తారావు పిలుపునిచ్చారు. గురువారం ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు.
గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న, ప్లాంటేషన్ మేనేజర్ ఆంజనేయులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం దత్తారావు మాట్లాడుతూ ‘ఇంటింటికి ఒక మొక్క‘ అనే నినాదంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ బుచ్చన్న, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






