దొడ్డి కొమరయ్య చరిత్రను భావితరాలకు అందిద్దాం
ఇన్చార్జి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి
కుమ్రంభీం అసిఫాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరా ట రైతాంగ వీరుడు, తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని ఇన్చార్జి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆసిఫా బాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మెంగ్రే ఆకాష్, మాజీ జడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, వెనుకబడిన తరగతుల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ ఈ సిద్ధిక్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




