20 May, 2026 | 3:47 AM

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దాం

20-05-2026 01:08 AM

తాడ్వాయి, మే, 19( విజయక్రాంతి): గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు బండారి సంజీవులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఎలాంటి విభేదాలు లేకుండా అందరు సమన్వయంగా కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు.

ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని ఈ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని శివాజీ, నాయకులు అంబీర్ శ్యాం రావు, మేకల రాజు, ఫారూఖ్,బాలరాజు, మహబూబ్, రాములు, హమీద్,రవి,శేఖర్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.