21 April, 2026 | 3:54 AM

ఢిల్లీ మిఠాయి వాలా పేరుపై న్యాయపోరాటం

21-04-2026 02:28 AM

అసలు యజమానికి అనుకూల తీర్పు 

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఢిల్లీ మిఠాయి వాలా పేరుతో నగ రంలో నడుస్తున్న కొన్ని స్వీట్స్ షాపులపై అసలు యజమాని జితేందర్ కాచ్వహ న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఢిల్లీ మిఠాయి వాలా పేరును 1968 నుంచే తమ పేరుతో రిజిస్టర్ చేసుకున్నామని, అదే పేరును ఇతరులు వినియోగించడంతో తమ బ్రాండ్ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని కోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన, ప్రిన్సిపల్ కమర్షియల్ కోర్టు, న్యాయమూర్తి ఉదయ్‌కుమార్, ఈ బ్రాండ్ హక్కులు జితేందర్ కాచ్వహ కే చెందుతాయని పేర్కొంటూ అనుకూల తీర్పు ఇచ్చారు.  కోర్టు ఆదేశాల మేరకు బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ ప్రాంతాల్లోని స్వీట్స్ షాపులకు ఢిల్లీ పేరును పోలీసులు సమక్షంలో తొలగించారు. నగరంలో ఎవరైనా ఢిల్లీ మిఠాయి పేరును అనధికారికంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తమ ఢిల్లీ మిఠాయి వాలా, మిఠాయి దుకాణం, కస్టమర్లకు, నాణ్యతతో కూడిన, తీపి మిఠాయిలు, విక్రయిస్తున్నామన్నారు.