30 August, 2026 | 12:36 AM

పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వాలి

29-08-2026 11:22 PM

ఏఐసీసీ కార్యదర్శి మోహన్ కు నాయకుల విజ్ఞప్తి

​కడ్తాల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపునివ్వాలని, రాత్రింబవళ్లు కష్టపడే అలాంటి నిబద్ధత కలిగిన వారికి పదవులు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ మోహన్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

శనివారం ​టీపీసీసీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణ కోసం కడ్తాల్‌ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి మోహన్‌ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్, ఎక్వాయిపల్లి సర్పంచ్ పాలకూర్ల కర్ణాకర్ గౌడ్ లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తో ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిప్రాయాలను చెప్పారు.ఈ సందర్భంగా పార్టీలో ఎదురవుతున్న పరిస్థితులు, క్షేత్రస్థాయి నాయకుల ఆకాంక్షలపై తమ అభిప్రాయాలను ఆయనతో స్పష్టంగా పంచుకున్నారు. ఈ ​కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు కోనాపూర్ వెంకటేష్, మరుపల్లి ఉపసర్పంచ్ మల్లేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.