ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ సమస్యలకు పరిష్కారం
బోథ్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ పేర్కొన్నారు. సోనాల మండలంలోని సాకేరగ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అక్కడే గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యలను విసలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట సర్పంచ్ మోతి సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సోనాల మండల అధ్యక్షులు గాజుల పోతన్న సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ జిల్లా అధికార ప్రతినిధి సంటి ప్రభువు చందర్ రెడ్డి గుడ్డు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






