ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఐక్యత భావం పెరుగుతుంది
బోథ్. ఆగస్ట్ 26 (విజయ క్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల గ్రామంలో భక్తి భావన పెరగడంతో పాటు గ్రామ ప్రజల్లో ఐక్యత భావం మరింతగా పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని కనుగొట్ల గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు కలిసికట్టుగా నిర్వహిస్తున్న కార్యక్రమం గొప్పదన్నారు.
భక్తుల కోరిక మేరకు ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు అసిఫ్ ఖాన్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ప్రపుల్ చందర్ రెడ్డి. మాజీ సర్పంచ్ బి మల్లేష్. మండల నాయకులు అంకత్ రవి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఆశన్న వార్డు సభ్యులు షాకీర్ గిరీష్ సోహెల్ కౌసర్ శంషుద్దీన్ అమీర్ పన్నాల శమిందర్ రెడ్డి పుట్టాల గంగారెడ్డి గ్రామస్తులు శబరిమాత ఆశ్రమ కమిటీ వారు పాల్గొన్నారు.






