సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దు
అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో తుంగతుర్తిలో నిరసన
తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళుతున్న బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ను యధావిదంగానే కొనసాగించాలని కోరుతూ బుధవారం సాయంత్రం తుంగతుర్తి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లినట్లయితే, జిల్లాలోని 10 లక్షల మంది ప్రజల చిరకాల వాంఛని, మండలాలు అభివృద్ధి చెందాయని, దీనితోపాటు వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లే విధంగా, యధావిధిగా అలైన్మెంట్ ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పోలబోయిన కిరణ్, గుగులోత్. రాజారాం నాయక్, బొడ్డు శంకర్, తాటికొండ సీతయ్య, సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, గాజుల మహేందర్, గుండ గాని. రాములు గౌడ్, పెద్ద బోయిన అజయ్ కుమార్, తాటి విజయమ్మ, బుర్ర శ్రీనివాస్, పల్లా సుదర్శన్, పూర్ణా నాయక్, సైదులు గౌడ్, రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






