21 July, 2026 | 9:49 AM

పాండురంగాశ్రమంలో ఆషాడి ఉత్సవాలకు రండి

20-07-2026 09:38 PM

- కలెక్టర్ హైమావతికి 95వ ఆశాఢి ఉత్సవాల ఆహ్వానం

గజ్వేల్: తెలంగాణ పండరీపురంగా ప్రసిద్ధి చెందిన మండలం భవానందపూర్ లోని  శ్రీ పాండురంగాశ్రమంలో నిర్వహించనున్న 95వ ఆశాఢి ఉత్సవాలకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతిని ఆశ్రమ నిర్వాహకులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాండురంగాశ్రమ నిర్వాహక వర్గ సభ్యుడు అప్పాల భావానంద శర్మ, భావానందపూర్ గ్రామ సర్పంచ్ సత్యమ్మ రమేష్, పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ కలిసి కలెక్టర్‌కు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే పాండురంగాశ్రమ ఆశాఢి ఉత్సవాలకు తప్పకుండా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు కోరగా, ఉత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకుంటానని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.