18 July, 2026 | 1:11 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

శ్రీ శివాలయంలో లక్ష కుంకుమార్చన ప్రారంభం

04-02-2026 04:05 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని  శ్రీ శివాలయం లో లలితా సహస్రనామ సహిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం ప్రతి మాసం ఒక మంగళవారం తీసుకుని 13 నెలాలకు గాను 13 లక్షలు పారాయణ సైత కుంకుమార్చన చేయడం వలన మహిళలు అఖండిత లక్ష్మి సౌభాగ్యంగా ఉండి, పారాయణం చేయడం వల్ల అష్టలక్ష్మి స్థిరంగా ఉండి కోరుకున్న కోరికలు నెరవేరుటకు మానసిక ఒత్తి డి ప్రశాంతతతో పాటు మహిళకు సౌభాగ్యం, కన్యలకు ఆలలితాంబ అమ్మవారు కుంకుమార్చన పారాయణం చేయడం వలన వివాహ యోగం ఉంటుందని ఆలయ అర్చకులు వల్లకొండ మఠం రమేష్ తెలిపారు.

ఆవునూరు ద్రాక్షాయని లలితాంబ మాతా గురించి ప్రసంగం మహిళల ను ఆకట్టుకున్నది, ఈ కార్యక్రమంలో మహిళల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయంలో ఏర్పాటు, రంగవల్లులు, ఆలయం విద్యుత్ దీపాలతో ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకి  సత్యనారాయణ పిలుపుమేరకు అలంకరణ చేశారు.