calender_icon.png 4 February, 2026 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ‌ద్య‌పానాన్ని నిషేదిస్తున్న‌ట్లు పెద్దలోడి గ్రామ‌స్తుల తీర్మాణం

04-02-2026 04:01:32 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద‌లోడి(లోనికాలాన్‌)లో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం బుధ‌వారం గ్రామ స‌ర్పంచ్ హ‌న్మంత్ రాజు అధ్య‌క్ష‌త‌న  గ్రామ స‌భ  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామసభలో మద్యపానం నిషేధిస్తూ తీర్మానం చేశారు గ్రామంలో మద్యపానంతో పాటు 18 ఏళ్ల లోపు వారికి దుకాణాదారులు సిగరెట్లు అమ్మకాలు చేయొద్దని తీర్మాణంలో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ  స‌ర్పంచ్ రాజు మాట్లాడుతూ... గ్రామంలో బెల్ట్‌షాపుల వల్ల యువత చెడిపోతున్నార‌ని,  మద్యపానం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయ‌ని, అందుకే  మ‌ద్యపానాన్ని గ్రామ‌స్తుల కోరిక  మేర‌కు నిషేదిస్తున్న‌ట్లు  ఆయ‌న తెలిపారు.

ఎవరైనా గ్రామంలో మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపితే పోలీసుల‌కు స‌మాచారం అందించి జ‌రిమానాలు విధించడం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యాన్ని గుర్తించి గ్రామంలో మార్పు కోసం ప్ర‌తి ఒక్కరూ పాటు ప‌డి గ్రామ పంచాయ‌తీలో తీర్మానించిన మ‌ద్యపాన నిషేదానికి స‌హ‌క‌రించాల‌ని స‌ర్పంచ్ రాజు  కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ ఉప స‌ర్పంచ్ మ‌న్నె ప్రేమ్‌నంద్, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి యాద‌గిరి,  వార్డు స‌భ్యులు  సభ్యులు పట్లోళ్ల జయమ్మ, మ‌న్‌సాన్‌ప‌ల్లి  జనార్ధన్, కోర్మ‌ని భారతమ్మ, సూర్ణు మౌనిక సుధాకర్, మ‌న్నె వినోద్ రావు,  మహిళా సంఘం అధ్యక్షురాలు వడ్డే శాంతమ్మ,  అలిగే శాంతమ్మ, సూర్ణు కేజీవమ్మ,  ఆశా వర్కర్లు సావిత్రి,  రోష‌మ్మ,  అంగన్వాడి టీచర్ మంజుల, గ్రామ‌స్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.