22 April, 2026 | 2:24 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

12 లక్షల కోట్లు హాంఫట్

10-03-2026 02:45 AM

ముంబై, మార్చి ౯: పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది. సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసాయి. ప్రారంభంలోనే బెంచ్‌మార్క్ సూచీలు తీవ్రంగా క్షీణించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ కీలకమైన 24 వేల స్థాయి కిందకు జారింది. మార్కెట్ల పత నంతో పెట్టుబడిదారుల సంపదలో ఒకేరోజులో సుమారు రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది.

రంగాల వారీగా.. బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో అత్యధిక అమ్మకాలు న మోదయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ ప్రారంభంలోనే నాలుగు శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. జపాన్ లికీ సూచీ, దక్షణ కొరియా కోస్పీ సూచీలు బాగా పడిపోయాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.