22 April, 2026 | 3:05 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

విజయవాడలో అసుస్ ప్రత్యేక స్టోర్

09-03-2026 11:22 PM

దేశమంతటా తన బ్రాండ్ యొక్క రిటైల్ ముద్రను బలపరుచుకునే దిశగా తైవానీస్ టెక్ దిగ్గజం అసుస్ ఇండియా విజయవాడలో కొత్త ప్రత్యేకమైన స్టోర్ ను ప్రారంభించింది. ఈ కొత్త ప్రత్యేకమైన స్టోర్ 350 చదరపు అడుగుల విస్తిర్ణంలో ఉన్నది మరియు విస్తారమైన పరిధిలో ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్, వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమ్‌ర్స్ ల్యాప్‌టాప్స్, గేమింగ్ డెస్క్‌టాప్స్, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్స్, మరియు ఉపకరణాల వంటి ASUS ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులను అందించబోతోంది.

తెలంగాణ, ఆంధ్రపేదేశ్‌లో ఇది బ్రాండ్ యొక్క 18వ ప్రత్యేకమైన స్టోర్. ఇండియాలో తమ రిటైల్ ముద్రను విస్తరణ ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నామనీ విస్తరణ గురించి జాతీయ సేల్స్ మేనేజర్, పర్సనల్ కంప్యూటర్ గేమింగ్ బిజినెస్ అసుస్ ఇండియా బిజినెస్ హెడ్ జిగ్నేష్ బశవర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో తమకు చాలా ముఖ్యమైన మార్కెట్‌ అనీ, విజయవాడ నగరంలో కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభంతో దేశంలోని వివిధ ప్రాంతాలంతటా వినియోగదారుల గుర్తింపు ఇక్కడకు మారుతుందంటున్నారు. ఒక వ్యూహాత్మక రిటైల్ విస్తరణతో, తమ యూజర్స్‌కి మరింత ఇంటరాక్షన్ మరియు కొత్త టచ్‌పాయింట్స్‌ని సృష్టించడాన్ని తాము కొనసాగిస్తామని చెప్పారు.