12-02-2026 06:10:45 PM
* స్వచ్ఛందంగా సమ్మెలో సంఘటితంగా పోరాటం
* జవహర్ నగర్ లో ఉద్యమంలా సమ్మె
జవహర్ నగర్,(విజయక్రాంతి): సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన సెగ చూపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లో దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని గురువారం ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ నల్ల చట్టాలతో కార్మిక వర్గానికి తీరనిలోటు జరుగుతుందని, నరేంద్రమోదీ చట్టాలను సవరించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్డీయూ, సీపీఐ, సీఐటీయూ, ప్రజా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.