ఎఫ్టీపీసీ చైర్మన్‌గా కూర్మారావు
ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిటీ ఛైర్మన్ (ఎఫ్టీపీసీ)గా హెల్త్ కేర్ రంగంలో గత 20 ఏళ్ల అనుభవం ఉన్న ఎస్.కూర్మారావు నియమితులయ్యారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూర్మారావుకు ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, పాకలపాటి విజయ్ వర్మ, ప్రముఖ నటీనటులు రవీందర్, వనితా చందర్‌లు నియామక పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్, చిత్రరంగంపై ఆధారపడినవారు వారి కుటుంబ సభ్యులకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలందించాలని సూచించారు. కూర్మారావు మాట్లాడుతూ సినీ రంగాలలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదాపూర్‌లో ఇటీవల ప్రారంభించిన సిమ్స్ హాస్పిటల్‌కు తాను ఈడీగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
సిమ్స్ ఆసుపత్రికి వచ్చిన సినీరంగ కార్మికులు ఎవరికైనా 50 శాతం రాయితీతో కన్సల్టేషన్ సౌకర్యంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలపై 20శాతం పైగా రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. రూ.99 విలువైన ప్రివిలైజ్ కార్డు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి స్నేహ అగర్వాల్, బిగ్‌బాస్ ఫేమ్ షానీ, ఎఫ్టీపీసీ సభ్యులు జి.మధుకర్, ఎం.ఈశ్వర్‌రావు, కిరణ్ బేజాడి, కోడె చైతన్య, నటి భవనా నాల్కర్ పాల్గొన్నారు.






