మల్టీపర్పస్ విధానన్ని రద్దు చేయాలి
గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తేదీ లోగ కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయాలి
జీవో నెంబర్ 51 సవరించాలి
కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి
PF ESI సౌకర్యం కల్పించారు
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉట్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందర రెండు రోజుల దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో విఫలం ఉంది కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాలో ఒకటవ తేదీలోగా డబ్బులు జమ చేస్తానని హామీ ఇచ్చిన పంచాయతీ కార్మికులకు అమలు కావడం లేదని అన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల ఖాతాల్లో వేతనాల డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో వేయడంలో విఫలం అయిందన్నారు. కార్మికుల కు కనీస వేతన 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 51 సవరించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సందర్భంగా ప్రజలకు అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయగల రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ మండల అధ్యక్షులు ఆత్రం సోనిరావు, మండల కోశాధికారి ఆల్క వెంకటరావు మండల ఉపాధ్యక్షులు గంగమ్మ, నరసమ్మ,సంతోష్, మండల నాయకులు అరుణ్, ఈశ్వరి,దుబ్బన్న, ఆశన్న, ప్రదీప్, ప్రశాంత్,భారత్, నర్సయ్య, లచ్చరెడ్డి, చిన్నాన్న, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.






