18 August, 2026 | 7:55 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

21-05-2026 12:21 AM

గద్వాల టౌన్ మే 20బుధవారం గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.గద్వాల టౌన్తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలు ఇటీవల సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం మంజూరు చేసింది.ఇందులో భాగంగా గద్వాల టౌన్కు చెందిన 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6 లక్షల 86 వేల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా అనేక పేద కుటుంబాలకు వైద్య మరియు అత్యవసరాల సమయంలో ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,జిల్లా సీనియర్ నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.